Canada: కెనడా వెళ్లే విద్యార్థులకు షాక్.. స్టడీ పర్మిట్లు 10 శాతం తగ్గింపు
- విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడ ప్రభుత్వం..
- తాత్కాలిక నివాసితుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడి..
- 2025లో అంతర్జాతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు 10 తగ్గిస్తున్నట్లు ఐఆర్‌సీసీ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడియన్ ఫెడరల్ సర్కార్ విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. ఇంటర్ నేషనల్ స్టూడెంట్స్ ను మరింత తగ్గిస్తున్నట్లు పేర్కొనింది. తాత్కాలిక నివాసితుల రాకపోకల పరిమితి నిర్వహణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. 2025లో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు 10 శాతం మేర తగ్గించబోతున్నట్లు చెప్పారు. ఇమ్మిగ్రేషన్, శరణార్థులు, పౌరసత్వం కెనడా (ఐఆర్‌సీసీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2024లో జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న 4,85,000 నుంచి 10 శాతం తగ్గితే కేవలం 4,37,000 మందికి మాత్రమే స్టడీ పర్మిట్లు అందుతాయని కెనడకు చెందిన ఓ వార్తా సంస్థ కథనం ప్రసారం చేసింది. ఇక, 2025లో జారీ చేసే స్టడీ పర్మిట్‌ల సంఖ్య 2026లో కూడా ఎలాంటి మార్పులు ఉండదని ప్రకటించారు.
Read Also: Ukraine drone attack in Russia: రష్యాలో పెను విధ్వంసం సృష్టించిన ఉక్రెయిన్
Also Read
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
కాగా, ఈ ఏడాది జనవరిలో దాదాపు 3,60,000 అండర్ గ్రాడ్యుయేట్ స్టడీ పర్మిట్‌లను కెనడియన్ ఫెడరల్ ప్రభుత్వం ఆమోదించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇది 2023లో జారీ చేయబడిన 5,60,000 స్టడీ పర్మిట్లతో పోలిస్టే దాదాపు 35 శాతం మేర తగ్గించబడింది. అయితే, కెనడా జనాభా 2024 మొదటి త్రైమాసికంలో 41 మిలియన్లకు పైగా ఉంది. ఇక, ఈ ఏడాది ప్రారంభంలో తాత్కాలిక నివాసితులలో భారీ పెరుగుదల కనిపించడంతో ఐఆర్‌సీసీ కీలక ప్రకటన వెలువరించింది. తాత్కాలిక నివాసితుల సంఖ్యపై ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది. తద్వారా 2026 నాటికి కెనడా మొత్తం జనాభాలో 6.5 శాతంగా ఉన్న తాత్కాలిక నివాసితుల సంఖ్యను 5 శాతానికి తగ్గించాలని అక్కడి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!