ప్రభుత్వం జిల్లాలో కృష్ణా నదీ తీరాన స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తోంది. ఇబ్రహీంపట్నంను ఆనుకుని ఉన్న కృష్ణా లంక భూములను మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమా, జిల్లా కలెక్టర్ లక్షిషా, ఇతర అధికారులు పరిశీలించారు. కృష్ణా నదిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల పరిధిలోనీ పెద లంక, చిన లంకలో ఉన్న లంకభూములు పరిశీలించారు. మూడు కిలోమీటర్లు లంక భూముల్లో కాలినడకన తిరిగారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో…