దేశంలోని మహిళలను శక్తివంతం చేయడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక పథకాలను నిర్వహిస్తోంది. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతపై ఎక్కువ దృష్టి సారించింది. ఈ దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరంలో మహిళల కోసం లఖ్పతి దీదీ యోజనను ప్రారంభించింది.
మధ్యంతర బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసింది. తన ప్రసంగంలో రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని 75000 కోట్ల రూపాయల రుణాన్ని అందజేస్తామని తెలిపింది.