అంతరిక్షయానంలో ప్రైవేట్ సంస్థలు పోటీపడుతున్నాయి. వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ సంస్థలు ఇప్పటికే అంతరిక్షయానంలో ముందడుగు వేశాయి. కాగా, ఇప్పుడు స్పేస్ ఎక్స్ సంస్థ మరో అడుగు ముందుకు వేసి భూకక్ష్యలోకి వ్యోమనౌకను పంపింది. ఈ వ్యోమనౌకలో నలుగురు పర్యాటకులు ఉన్నారు. వీరు మూడు రోజుల పాటు ఈ వ్యోమనౌకలో భూమిచుట్టూ ప్రదక్షణ చేస్తారు. మూడు రోజుల తరువాత వీరు తిరిగి భూమిమీదకు రానున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఇన్ఫిరేషన్ 4 పేరుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.…