Pregnancy Tips: ప్రస్తుతం చాలా మంది దంపతులు పిల్లలు లేక అనేకమంది ఇబ్బంది బాధపడుతున్నారు. ఈ ఇన్‌ఫెర్టిలిటీ (సంతానలేమి) సమస్య ఓ నివేదిక ప్రకారం భారతదేశంలో 10 నుంచి 15 శాతం వరకూ ఉందని తేల్చింది. అయితే ఈ సంతానలేమి సమస్యలకి మహిళల సమస్యలే ప్రధాన కారణంగా ఎక్కువగా భావిస్తున్న, పురుషుల్లోనూ ఈ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ సమస్యకు ప్రధాన కారణాలేంటో ఒకసారి చూద్దామా.. Read Also: Sperm Count: వీర్యకణాల…
మన జీవితంలో దాదాపు సగం కాలాన్ని నిద్రలోనే గడుపుతాం. ఆరోగ్యానికిది ఎంతో అవసరం. సరిగా నిద్ర పట్టకపోతే చిరాకు, అలసట, విచారం కలుగుతాయి. శారీరక స్పందనల వేగమూ తగ్గుతుంది. తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలెన్నో చుట్టుముడతాయి. దీర్ఘకాలంగా తగినంత నిద్ర పట్టకపోతే నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి.
క్షయవ్యాధి (TB) అనేది ఒక అంటు వ్యాధి, ఇది టీబీ బాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది సాధారణంగా ఊపిరితిత్తులలో సంభవిస్తుంది, దీనిని పల్మనరీ టీబీ అని పిలుస్తారు. అయితే ఇది మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు లేదా శరీరంలోని ఏదైనా ఇతర భాగాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు, దీనిని ఎక్స్‌ట్రాపల్మోనరీ టీబీ అంటారు. కొన్ని సందర్భాల్లో టీబీ బ్యాక్టీరియా పునరుత్పత్తి అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది, దీనిని జననేంద్రియ క్షయవ్యాధి అని పిలుస్తారు.
Around 1 in 6 people worldwide experience infertility: ప్రతీ ఆరుగురిలో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) తన కొత్త నివేదికలో పేర్కొంది. మొత్తం వయోజన జనాభాలో 17.5 శాతం మందికి ఈ సమస్య ఉన్నట్లు తెలిపింది. ఈ సమస్యను అధిగమించేందుకు సంతాన సాఫల్యత చర్యలను చేపట్టాలని, అవి అందరికి అందుబాటులో ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.