గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. చైనాలోని వూహాన్ నగరంలో మొదటిసారి కరోనా బయటపడిన తరువాత ఈ వైరస్ అనేక రకాలుగా మార్పులు చెందుతూ దాడులు చేస్తూనే ఉన్నది. సార్స్ కోవ్ 2, డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు ఇబ్బందులకు గురిచేశాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. అయితే, మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్‌ను కనుగొన్న తరువాత మరణాల సంఖ్య తగ్గింది. సాధారణంగా కరోనా వైరస్ మనిషి శరీరంలో రెండు వారాల వరకు ఉంటుంది.…