వార్షాకాలం పాదాల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలంలో ఎక్కడ చూసినా తడిగా ఉంటుంది. నీటిలో తడవడం, తడి షూస్, సాక్సులు ధరించడం వంటి వాటివల్ల పాదాలకు ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్లు ఎక్కువసేపు నానడం వల్ల .. పాదాల ఒరుపులు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ సీజన్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. మన పాదాలను కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
READ MORE: Saindhav Disease: సైంధవ్ సినిమాలో అరుదైన జబ్బు.. 16 కోట్ల ఇంజెక్షన్ కోసం టీడీపీ అభ్యర్ధన!
తడి వాతావరణంలో పాదాల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బురదలో ఎక్కువసేపు పాదాలకు ఉంచితే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బయటి నుంచి వచ్చిన వెంటనే శుభ్రమైన నీటితో పాదాలను, కాళ్లను కడుక్కోవాలి. అనంతరం పొడి బట్టతో తుడుచుకోవాలి. వర్షంలో నిల్వ ఉన్న నీటిలో అనేక రకాల క్రిములు ఉంటాయి. అవి కాలి గోళ్ళలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. దీని నుంచి గోళ్ల ఇన్ఫెక్షన్ కూడా బంధిస్తుంది. కాబట్టి ఈ సమయంలో గోళ్లను పొట్టిగా కత్తిరించుకోవడం మంచిది. ఈ సీజన్ లో వారానికి ఒకసారి ఇంట్లోనే పెడిక్యూర్ చేయడం మర్చిపోవద్దు. ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో మైల్డ్ షాంపూ, ఉప్పు కలపాలి. తర్వాత ఆ నీటిలో పాదాలను 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టాలి. ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు పాదాలను సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. గోళ్ల బేస్ లో క్యూటికల్ ఆయిల్ అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వర్షాకాలంలో బయటకు వెళ్లాలంటే షూస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో ప్లాస్టిక్ బూట్లు ధరించాలి. ఎందుకంటే ఈ బూట్లు త్వరగా ఎండిపోతాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్ ను సులభంగా తప్పించుకోవచ్చు. నీళ్లలో పాదాలు ఎక్కువ సేపు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.