రెండుసార్లు ఒలింపిక్ విజేత పివి సింధు గురువారం ఇండోనేషియా ఓపెన్ 2023 నుంచి చైనీస్ తైపీకి చెందిన తాయ్ జు-యింగ్‌తో వరుస గేమ్‌లలో ఓడిపోయి నిష్క్రమించింది. రౌండ్ ఆఫ్ 16లో తాయ్ జు యింగ్‌పై సింధు 18-21, 16-21 తేడాతో పరాజయం పాలైంది.
ఇండోనేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. టోర్నీ నుంచి భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ నిష్క్రమించాడు. ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్‌కు తొలి రౌండ్లోనే ఊహించని పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 21-23, 10-21తో 41వ ర్యాంకర్ బ్రైస్ లెవెర్‌దెజ్ (ఫ్రాన్స్) చేతిలో అతడు ఓటమి పాలయ్యాడు. గతంలో లెవెర్‌డెజ్‌తో ఆడిన ఐదుసార్లూ గెలిచిన శ్రీకాంత్ ఆరోసారి మాత్రం ఓటమి చవిచూశాడు. 42 నిమిషాల్లో…