Kargil War: 1999లో భారత్‌పై పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదుల ముసుగులో కార్గిల్ యుద్ధానికి తెరలేపింది. అయితే, ఈ యుద్ధం జరిగి ఇప్పటికి 25 ఏళ్లు గడిచినా ఇందులో పాకిస్తాన్ ఆర్మీ తన ప్రేమేయం గురించి ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. ఈ యుద్ధం వెనక కర్త,కర్మ,క్రియ అంతా పాకిస్తాన్ ఆర్మీ అనేది బహిరంగ రహస్యమే అయినా, ఎప్పుడు కూడా తన పాత్రను అంగీకరించలేదు. ఇదిలా ఉంటే, తొలిసారిగా పాకిస్తాన్ ఈ యుద్ధంతో తమ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసింది.