Nishikant Dubey: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ ఇటీవల కాంగ్రెస్ ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటును, అమెరికాను లెక్కచేయని తెగువను ప్రశంసించింది. అయితే, తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇందిరాగాంధీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. భారతదేశం 1968లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి అంగీకరించిందని, దీని ఫలితంగా 1965 భారత్-పాక్ యుద్ధంలో గెలిచినప్పటికీ, రాన్ ఆఫ్ కచ్‌లోని 828 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు అప్పగించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శనివారం విమర్శించారు.
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో నేటి నుంచి హాస్టళ్లు తాత్కాలికంగా మూసివేశారు వర్సిటీ అధికారులు.. భారత్-పాక్ యుద్ధం కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు ముగిసిన వారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.
Indo-Pak War Time: తాజాగా పశ్చిమ త్రిపుర జిల్లాలో 1971 ఇండో-పాక్ యుద్ధ కాలానికి చెందిన మొత్తం 27 మోర్టార్ షెల్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. దులాల్ నామా ఇంటి వద్ద కూలీలు చెరువు తవ్వుతుండగా ఈ మందు గుండ్లు బయటపడ్డాయి. తొలుత 12 మోర్టార్ షెల్స్ లభ్యమయ్యాయని, ఆ తర్వాతి తవ్వకాల్లో మరో 15 దొరికాయని పోలీసులు తెలిపారు. సుమారు 50 సంవత్సరాల నాటివిగా అంచనా వేస్తున్న ఈ మోర్టార్ షెల్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని బముటియా…
Henry Kissinger: హెన్రీ కిస్సింజర్ ప్రఖ్యాత అమెరికన్ దౌత్యవేత్త. ఇందిరాగాంధీ హయాంలో భారత్-అమెరికా బంధాల్లో విభేదాలకు సాక్ష్యంగా ఉన్నారు. కిస్సింజర్ 100 ఏళ్ల వయసులో అమెరికాలో మరణించారు. అయితే ఇందిరాగాంధీపై కోపంతోనే అమెరికా, చైనాకు దగ్గరైందనే వాదని ఉంది. ఈ రెండు దేశాల సంబంధాల్లో కిస్సింజర్ ప్రముఖ పాత్ర వహించారు. తాజాగా మోడీ నాయకత్వంలో భారత్‌తో బంధాన్ని మెరుగుపరుచుకోవాలని ఆశించారు.
Pakistan Border Guarding Force personnel refuses to accept sweets on BSF Raising Day: ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన సరిహద్దుల్లో ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులు ఒకటి. అయితే ఇరు దేశాల మధ్య ఎన్ని వైషమ్యాలు ఉన్నా.. బోర్డర్ లోని ఇరు దేశాల జవాన్లు పండగల సమయంలో, జాతీయ దినోత్సవాల సమయంలో స్వీట్లు పంచుకుంటారు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న సంప్రదాయం. అయితే బీఎస్ఎఫ్ రైజింగ్ డే సందర్భంగా భారత జవాన్లు స్వీట్లను పంచితే తీసుకోవడానికి…