Pakistan Border Guarding Force personnel refuses to accept sweets on BSF Raising Day: ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన సరిహద్దుల్లో ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులు ఒకటి. అయితే ఇరు దేశాల మధ్య ఎన్ని వైషమ్యాలు ఉన్నా.. బోర్డర్ లోని ఇరు దేశాల జవాన్లు పండగల సమయంలో, జాతీయ దినోత్సవాల సమయంలో స్వీట్లు పంచుకుంటారు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న సంప్రదాయం. అయితే బీఎస్ఎఫ్ రైజింగ్ డే సందర్భంగా భారత జవాన్లు స్వీట్లను పంచితే తీసుకోవడానికి మాత్రం పాకిస్తాన్ జవాన్లు నిరాకరించారు.
ఇటీవల ఈద్, దీపావళి సమయాల్లో ఇరు దేశాల సైనికులు, ఇరు దేశాల సరిహద్దుల్లోని అన్ని బెటాలియన్లు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్( బీఎస్ఎఫ్) రైజింగ్ డే సమయంలో మాత్రం భారత జవాన్లు ఇచ్చిన స్వీట్లను తీసుకునేందుకు అంగీకరించలేదు. సాధారణంగా రైజింగ్ డే సందర్భంగా పాకిస్తాన్ బోర్డర్ గార్డ్ ఫోర్స్(బీజీఎఫ్) సిబ్బందికి స్వీట్లను అందించడం ఓ సంప్రదాయం. కానీ గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాత్రం స్వీట్లను తీసుకోలేదని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. అయితే తాము స్వీట్లను తీసుకోవాలని పై అధికారుల నుంచి ఆదేశాలు రాలేదని బీజీఎఫ్ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: Delhi: మరో లివ్ ఇన్ రిలేషన్ కేసు..శ్రద్ధా తరహాలో మహిళ హత్య..
మనదేశంలో సరిహద్దులను రక్షించేందుకు బీఎస్ఎఫ్ తో కూడిన రక్షణ దళం ఉంటుంది. ఇది స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి స్వతంత్ర కేడర్ ఉంటుంది. అయితే పాకిస్తాన్ సరిహద్దు రక్షణ దళంలో ఇలా ఉండదు. సాధారణంగా పాకిస్తాన్ సైన్యం నుంచి డిఫ్యూటేషన్ పై వచ్చిన వారే దీన్ని నిర్వహిస్తుంటారు. అయితే ఇటీవల భారత్ అంటే బద్ధ శతృవుగా చూసే అసిమ్ మునీర్ పాక్ సైన్యాధ్యక్షుడిగా నవంబర్ 29న బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చిన తర్వాతే ఇలా జరిగిందని తెలుస్తోంది.
భారత్ సరిహద్దులను కాపాడే సంస్థగా ఉంది బీఎస్ఎఫ్. డిసెంబర్1, 1965న స్థాపించబడింది. 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఈ దళం బాగా పనిచేసింది. బీఎస్ఎఫ్ మహావీర్ చక్ర, వీర్ చక్ర వంటి అత్యున్నత శౌర్య పురస్కాలను అందుకుంది.