Pakistan denies: పాక్ మరోసారి ప్రపంచం కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేసింది. అది ఏ విషయంలో అంటే.. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చేసినట్లు వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే కదా. దీనిపై పాకిస్థాన్ మరోసారి నోరుపారేసుకుంది. ఉగ్రవాద శిబిరాలను ఇండియా నేలమట్టం చేసినప్పటికీ.. తమ సైన్యానికి సంబంధించి ఒక్క విమానం కూడా దెబ్బతినలేదంటూ కవర్ చేయడానికి ప్రయత్నించింది. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. భారత వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పేర్కొన్న విషయాలపై స్పందించారు. “భారత్ చేసిన దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఒక్క యుద్ధ విమానం కూడా దెబ్బతినలేదు. మేం అంతర్జాతీయ మీడియాకు వివరాలు వెల్లడించాం. మూడు నెలలుగా ఎలాంటి వాదనలు లేవు. ఇంత ఆలస్యంగా చేసిన వాదనలు నమ్మశక్యంగా లేవు” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Vadde Naveen : వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రిలీజ్..
ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఏం మాట్లాడారంటే..
ఆపరేషన్ సింధూర్‌లో సమయంలో పాక్ చెందిన ఐదు యుద్ధ విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయనే అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. యుద్ధం ఇలాగే కొనసాగితే భారీ మూల్యం తప్పదని దాయాదికి అర్థమైందని, అందుకే కాళ్లబేరానికి వచ్చారన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో మన గగనతల రక్షణ వ్యవస్థ, ఎస్-400 క్షిపణి వ్యవస్థలు సమర్థంగా పనిచేశాయని అన్నారు. పక్కా ప్రణాళికతో ఆపరేషన్ ను నిర్వహించామని, కేవలం 80-90 గంటల్లోనే లక్ష్యాలను సాధించామని పేర్కొన్నారు. తమ దాడిలో బహవల్పూర్ – జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయంలో పూర్తిగా ధ్వంసం అయిపోయిందని అన్నారు. దాదాపుగా భవనంలో ఎటువంటి సామగ్రి మిగిలి లేదని అన్నారు.
READ MORE: Pakistan Balochistan Operation: బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పాక్ ఆపరేషన్.. ఎంత మంది చనిపోయారంటే..