Rishabh Pant: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత ప్లేయర్లు బ్యాటింగ్ లో రెచ్చిపోతున్నారు. మొదటి రోజు యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్ మన్ గిల్ సెంచరీలో అదరగొట్టగా, రెండో రోజు వికెట్ కీపర్ రిషబ్ పంత్ శతకంతో దుమ్మురేపాడు. జైస్వాల్, గిల్, పంత్ సెంచరీలతో ఇంగ్లాండ్ పై భారత్ అధిపత్యం కొనసాగిస్తోంది.