Hyperloop: ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌కి ఇండియా సిద్ధమవుతోంది. ఈ మేరకు భారతదేశంలో మొట్టమొదటి ‘‘హైపర్‌లూమ్’’ టెస్ట్ ట్రాక్‌ని మరింత డెవలప్ చేయడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్‌కు, ఇండియన్ రైల్వేస్ అదనంగా 1 మిలియన్ డాలర్లు మంజూరు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ సోమవారం ప్రకటించారు.
Mahakumbh 2025 : ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే ఆదివారం న్యూఢిల్లీ నుండి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైళ్లను నడిపింది. అలాగే, గత సంఘటనలను దృష్టిలో ఉంచుకుని,
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట తర్వాత భారతీయ రైల్వే కీలకమైన చర్యలు తీసుకోనుంది. దేశవ్యాప్తంగా 60 రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో శాశ్వత హోల్డింగ్ జోన్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి కమిటీ వేసింది. ఉన్నత స్థాయి కమిటీలో నార్త్ రైల్వేస్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ దేవ్, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ కమిషనర్ పంకజ్ గంగ్వార్‌లు ఉన్నారు. కాగా.. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది.
Delhi Stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సంఘటన వల్ల ప్రభావితమైన ప్రజలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తుంది.
Mahakumbh 2025 : మహా కుంభమేళాకు రైళ్లలో వచ్చే, వెళ్ళే యాత్రికులకు సౌకర్యాలను న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో నిర్మించిన వార్ రూమ్ నుండి పర్యవేక్షిస్తున్నారు.
Pamban Bridge : రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన పంబన్ వంతెన జాతికి అంకితం కావడానికి రెడీగా ఉంది. రాబోయే కొన్ని వారాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ కొత్త రైల్వే వంతెనను ప్రారంభిస్తారు.
Divyangjan Rail Card: రైల్వేపాసుల కోసం ఇకపై దివ్యాంగులు రైల్వే కార్యాలయాలు, స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇందుకోసం భారత రైల్వేశాఖ కొత్తగా ఆన్లైన్ పాస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంటి నుంచే పాస్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా http://divyangjanid.indianrail.gov.in అనే వెబ్సైట్ ప్రారంభించారు. దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి రైల్వేశాఖ రాయితీపై ప్రయాణ సౌకర్యం అందిస్తోంది. రైళ్లు, బస్సుల్లో ప్రత్యేక సీట్లు కేటాయించడంతోపాటు ఛార్జీల్లోనూ…
Vandhe Bharat : ప్రధాని మోదీ కలల ప్రాజెక్ట్ వందేభారత్ రోజురోజుకు ఆదరణ పెంచుకుంటుంది. దేశ వ్యాప్తంగా వందే భారత్ సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఎప్పటి కప్పుడు పలు రూట్లలో కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతుంది.
సామాన్యుడి విమానంగా పేరుగాంచిన ట్రైన్ జర్నీకి విశేషమైన ఆదరణ ఉంటుంది. తక్కువ ప్రయాణ ఛార్జీలు, సమయం ఆదా అవుతుండడంతో రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మరో కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. బుక్ నౌ, పే లేటర్ అనే సర్వీస్ ను ప్రారంభించింది. ఈ సేవతో మీరు డబ్బులు లేకపోయినా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి చెల్లించకుండానే జీరో పేమెంట్ తో…