సరుకు రవాణ చేసే గూడ్స్ రైళ్లు మహా అయితే 50 నుంచి 80 బోగీలు ఉంటాయి. ఇండియన్ రైల్వేలకు సరుకు రవాణా ద్వారానే అధిక మొత్తంలో ఆదాయం వస్తుంది. అయితే, ఎక్కువ గూడ్స్ రైళ్లను నడపడం వలన ప్రజా రవాణా రైళ్లకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ఇండియన్ రైల్వే వ్యవస్థ అనేక ప్రయోగాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే 176 బోగీలు, 6 రైలు ఇంజన్లతో కూడిన త్రిశూల్ రైలును తయారు చేసింది. ఇది పూర్తిగా…
తరచూ రైళ్లలో ప్రయాణించేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. రైళ్ల రాకపోకలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే.. కొత్తగా తీసుకున్న నిర్ణయాలు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయని ప్రకటన విడుదల చేసింది. కొత్త రైళ్లను అందుబాటులోకి తేవడమే కాకుండా కొన్ని మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లుగా, కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చింది. అంతేకాదు పలు రైళ్లను దారి…
కరోనా వైరస్ పంజా విసిరనప్పటి నుంచి క్రమంగా రైళ్లు పట్టాలు ఎక్కడం తగ్గిపోయింది.. అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతూ వచ్చినా.. పూర్తిస్థాయిలో నడపలేదు.. ఇక, కోవిడ్ సెకండ్ వేవ్ కలకలం సృష్టించడంతో.. నడిచే రైళ్లు కూడా నిలిపివేసిన పరిస్థితి.. అయితే, క్రమంగా కేసులు తగ్గుతోన్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాలు మెట్రో రైళ్లను, ఎంఎంటీఎస్లను క్రమంగా పట్టాలెక్కిస్తున్నాయి.. మరోవైపు రైల్వేశాఖ ఇప్పటికే పలుమార్గాల్లో ప్యాసింజర్లతో పాటు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతుండగా.. పలు రూట్లలో పెద్ద ఎత్తున రైళ్లను…