దేశంలో రైల్వే ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఈ మేరకు భారతీయ రైల్వే సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కవచ్ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని చేపట్టింది. భద్రత, దాని సామర్థ్యం పెంపు కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ప్రపంచ స్థాయి టెక్నాలజీ కవచ్ అందుబాటులోకి రావడం వల్ల రైల్వే ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు ఆశిస్తున్నారు. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా అవి ఢీకొట్టుకునే అవకాశాలు ఉండవని చెప్తున్నారు.…
రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వేశాఖ.. ప్రయాణికుల కోసం మరో వెసులుబాటు కల్పించింది ఇండియన్ రైల్వేస్. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ సర్వీస్‌ను ప్రారంభించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐఆర్‌సీటీసీ, ఎన్‌పీసీఎల్, సంస్థలు సంయుక్తంగా ఓ క్రెడిట్ కార్డును రూపొందించాయి. ఎక్కువగా రైల్వే ప్రయాణాలు చేసే వారికి.. గరిష్ట పొదుపును అందించేందుకు ఈ కార్డ్‌ను ప్రత్యేకంగా క్యూరేట్ చేశారు. అయితే కార్డు జారీ అయిన 45 రోజులలోపు వెయ్యి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోలు…
ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని జమ్మూకాశ్మీర్‌లో భారత ప్రభుత్వం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్ వ్యాలీని జమ్మూతో అనుసంధానం చేసేందుకు ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. చినాబ్ నడిపై 1.3 కిలోమీటర్ల మేర 359 మీటర్ల ఎత్తులో రైల్వే బ్రిడ్జి ఉండబోతున్నది. ఫ్రాన్స్‌లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఈ బ్రిడ్జి ఉంటుంది. ఈ బ్రిడ్జి కిందనుంచి మేఘాలు పాస్ అవుతున్న దృశ్యాలను రైల్వేశాఖ మంత్రి అశ్విన్ సోషల్ మీడియాలో…
రైల్వేశాఖ సరికొత్త ఐడియా ఆ శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నది. 150 సంత్సరాలుగా దేశంలో రైళ్లు సేవలు అందిస్తున్నాయి. నిరంతరం వేల కిలోమీటర్ల మేర రైళ్లు పరుగులు తీస్తున్నాయి. దేశంలో 50 సంత్సరాల నుంచి సేవలు అందిస్తున్న రైల్వే పెట్టెలు అనేకం ఉన్నాయి. అవి ప్రస్తుతం ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్నింటిని మ్యానేజ్ చేసి ఏదోలా నడిపిస్తున్నారు. ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్న రైల్వే కోచ్‌లు అనేకం ఉన్నాయి. వీటిని అలాగే వదిలేస్తే తుప్పుపట్టిపోతాయి. వీటిని ఎలాగైనా వినియోగించుకోవాలని…
భారతీయ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలులో వెనుక బోగీలో ఉండే వ్యక్తిని ఇకపై గార్డు అని పిలవకూడదని.. ట్రైన్ మేనేజర్ అని పిలవాలని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. మరోవైపు అసిస్టెంట్ గార్డును అసిస్టెంట్ ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్, గూడ్స్ గార్డును గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ గూడ్స్ గార్డును సీనియర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ ప్యాసింజర్ గార్డును సీనియర్ ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్, మెయిల్/ఎక్స్‌ప్రెస్ గార్డును మెయిల్/ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మేనేజర్‌గా మారుస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు…
రైల్వే ప్రయాణికులకు ఐఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఉత్తర భారతదేశం సందర్శించుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. విజయవాడ నుంచి పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు IRCTC డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వీటికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కొత్త ఏడాదిలో మూడు నెలల పాటు 3 ప్రత్యేక టూరిస్ట్ ట్రైన్లు ప్రారంభిస్తున్నామన్నారు. తీర్థయాత్ర ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా గుజరాత్ యాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. మొదటి టూర్…
రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. ఎందుకంటే సౌత్ వెస్ట్రన్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు అయితే.. మరికొన్ని దారి మళ్లించారు అధికారులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా బెంగళూరు వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది సౌత్ వెస్ట్రన్ రైల్వే .. యలహంక – పెనుకొండ మధ్య డబ్లింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా.. ఈ నెల 12, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్…
జవాద్ తుఫాన్ దూసుకొస్తుండడంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు.. ఈస్ట్ కోస్ట్ రైల్వేతో పాటు దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏకంగా 120 రైళ్లను రద్దుచేసినట్టు అధికారులు వెల్లడించారు.. ఈ నెల 2వ తేదీ నుంచి కొన్ని రైలు సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే కాగా.. నిన్న కూడా కొన్ని రైళ్లు పట్టాలు ఎక్కలేదు.. ఇవాళ కూడా మరికొన్ని రైళ్లు స్టేషన్లకే పరిమితం కానున్నాయి. ఈ నెల…
భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేయనున్నారని వస్తున్న వార్తలపై కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత ఐకానిక్ అయిన రైల్వేలను ప్రైవేటీకరణ చేయనున్నామని లేదా విక్రయిస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. భవిష్యత్‌లోనూ అలాంటి నిర్ణయం ఉండదని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే అనేది క్లిష్టమైన వ్యవస్థ అని… రైల్వేలను ప్రైవేటీకరించే విషయంపై కేంద్రం ఎలాంటి చర్చలు జరపడంలేదని ఆయన పేర్కొన్నారు. కాగా గతంలోనూ రైల్వేల…