తరచూ రైళ్లలో ప్రయాణించేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. రైళ్ల రాకపోకలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే.. కొత్తగా తీసుకున్న నిర్ణయాలు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయని ప్రకటన విడుదల చేసింది. కొత్త రైళ్లను అందుబాటులోకి తేవడమే కాకుండా కొన్ని మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లుగా, కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చింది. అంతేకాదు పలు రైళ్లను దారి మళ్లించింది. వేగం పెంచడం, టెర్మినల్స్ లో మార్పులు చేయడం లాంటి చర్యలకు పూనుకుంది.. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ మార్పులు అన్నీ అమలు చేయనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ సమాచారం కోసం IRCTC వెబ్‌సైట్, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్, సంబంధిత రైల్వే స్టేషన్ల స్టేషన్ మేనేజర్ / ఎంక్వయిరీ కౌంటర్‌ని సంప్రదించవచ్చని సూచించింది.. దక్షిణ మధ్య రైల్వేలో మొత్తం 872 ట్రైన్ సర్వీసులు నడుస్తుండగా.. 673 ట్రైన్స్ స్పీడ్ పెంచినట్టు గా వెల్లడించింది.