ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కొత్తగా అడుగుపెట్టబోతున్న లక్నో ఫ్రాంచైజీకి అధికారులు నామకరణం చేశారు. ఇకపై లక్నో ఫ్రాంచైజీని లక్నో సూపర్ జెయింట్స్ అని పిలవనున్నారు. తమ ఫ్రాంచైజీకి పేరును సూచించాలంటూ లక్నో జట్టు సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించింది. ఈ క్రమంలో లక్నో ఫ్రాంచైజీ అధినేత సంజీవ్ గోయెంకా తమ జట్టు పేరును అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు టీమ్ లోగోను కూడా ఆవిష్కరించారు. అయతే ఈ పేరు గతంలో ఆడిన పూణె జట్టుకు ఉండేది.…
కరోనా కారణంగా ఇండియాలో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ యూఏఈ లో ముగిసింది. కానీ ఐపీఎల్ 2022 పూర్తిగా ఇండియాలోనే జరుగుతుంది అని ఈ మధ్యే బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు ఐపీఎల్ 2022 పై కసరత్తు చేస్తుంది బీసీసీఐ. ఇక తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జరగాల్సిన ఐపీఎల్ 15వ సీజన్ ఏప్రిల్ 2, 2022న ప్రారంభించాలని బీసీసీఐ అనుకుంటున్నట్లు సమాచారం. కానీ…
క్రికెట్‌లో కాసులు కురిపించే ఐపీఎల్‌కు మంచి డిమాండ్ ఉంది. ఐపీఎల్ అటు బీసీసీఐకి.. ఇటు ఆటగాళ్లకు బంగారు కోడిపెట్ట లాంటిది. అందుకే ఐపీఎల్ ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో వచ్చే ఏడాది రెండు కొత్త ఫ్రాంచైజీలు బరిలోకి దిగనున్నాయి. ఈ ఫ్రాంచైజీల కోసం బీసీసీఐ బిడ్డింగ్ ప్రక్రియను షురూ చేసింది. కొత్తగా రానున్న రెండు జట్లలో ఓ జట్టును సొంతం చేసుకునేందుకు బాలీవుడ్ టాప్ కపుల్ ప్రయత్నాలు చేస్తోంది. Read…