ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తీరు మారడం లేదు.. ఈ సీజన్‌లో ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది.. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. 16 ఓవర్లు ఆడిన కోల్‌కతా ఇంకో నాలుగు ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ ప్యాట్ కమిన్స్ హాఫ్ సెంచరీలతో రాణించారు. కమిన్స్ కుమ్మేశాడు. ఆఖరిలో వచ్చి బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. సిక్సుల వర్షం కురిపించాడు. మ్యాచ్ ని ఏకపక్షం చేశాడు.
Read Also: BJP: నేటి నుంచి ‘జలం కోసం-జన పోరు యాత్ర’
కమిన్స్ 15 బంతుల్లోనే 56 పరుగులు చేసి ధాటిగా ఆడాడు. దీంతో గతంలో ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ రికార్డును కమిన్స్ సమం చేశాడు. కమిన్స్ వీర బాదుడుతో ఐపీఎల్ 2022లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా ఈ మ్యాచ్‌లోనే డేనియల్ సామ్స్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్, ఇషాన్ కిషన్ తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత వచ్చిన డివాల్డ్ బ్రీవిస్ 19 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 52 పరుగులతో ఆదుకున్నాడు. తిలక్ వర్మ రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 27 బంతుల్లో 38 పరుగులు చేయగా.. పోలార్డ్ మూడు సిక్సర్లతో 5 బంతుల్లో 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక, ఇవాళ లక్నో, ఢిల్లీ కేపిటల్స్ తలపడనున్నాయి. రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభం కానుంది.