ప్లేయర్లతో ఓ మీటింగ్ న్ని ముంబై మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి నెహాల్ ఆలస్యంగా రావడం వల్లే.. అందుకే అతనికి ఈ శిక్ష విధించినట్లు పేర్కొంది. జట్టుతో పాటు, నెహాల్ కూడా సరదాగా ఈ శిక్షను అనుభవించాడు. అందుకే నేహాల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్యాడ్ వేసుకుని నడుస్తున్నది మనకు కనిపిస్తుంది.
ఐపీఎల్ 2023 సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టులో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో గాయం కారణంగా ఐపీఎల్ 2023కి దూరమయ్యాడు.
IPL Cricket: ఐపీఎల్ అంటే అందరికీ తెలుసు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని. కానీ.. ఐపీఎల్‌ని ఇండియన్ ప్రాఫిటబుల్ లీగ్ అని సైతం అభివర్ణించొచ్చు. మన దేశంలోని అత్యంత విజయవంతమైన, అత్యధిక లాభదాయకమైన నవతరం స్టార్టప్‌లలో ఒకటిగా ఐపీఎల్ ఇప్పటికే తననుతాను నిరూపించుకుంది. బిజినెస్ విషయంలో.. విలువ పరంగా.. ఐపీఎల్.. యూనికార్న్ లెవల్ నుంచి డెకాకార్న్ స్థాయికి ఎదిగింది. ఈ క్రికెట్ లీగ్ వ్యాల్యూని డీ అండ్ పీ అడ్వైజరీ అనే కన్సల్టింగ్ సంస్థ వెల్లడించింది.
వచ్చే ఏడాది ఆరంభంలో మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించాలని బోర్డు భావిస్తోందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మంగళవారం అన్ని రాష్ట్ర సంఘాలకు తెలిపారు. 2022-23 కోసం స్వదేశీ అంతర్జాతీయ, దేశీయ సీజన్‌పై ముఖ్యమైన అంశాలను వివరిస్తూ గంగూలీ అన్ని రాష్ట్ర సంఘాలకు లేఖ రాశారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను నియమించింది. లెజెండరీ బ్యాట్స్‌మన్ టామ్ మూడీ స్థానంలో బ్రియాన్ లారాను ప్రధాని కోచ్‌గా నియమించినట్లు ఎస్‌ఆర్‌హెచ్ అధికారికంగా ధ్రువీకరించింది.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తీరు మారడం లేదు.. ఈ సీజన్లో ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది.. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. 16 ఓవర్లు ఆడిన కోల్‌కతా ఇంకో నాలుగు ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ ప్యాట్ కమిన్స్ హాఫ్ సెంచరీలతో రాణించారు. కమిన్స్ కుమ్మేశాడు. ఆఖరిలో వచ్చి బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. సిక్సుల వర్షం కురిపించాడు. మ్యాచ్…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కొత్తగా అడుగుపెట్టబోతున్న లక్నో ఫ్రాంచైజీకి అధికారులు నామకరణం చేశారు. ఇకపై లక్నో ఫ్రాంచైజీని లక్నో సూపర్ జెయింట్స్ అని పిలవనున్నారు. తమ ఫ్రాంచైజీకి పేరును సూచించాలంటూ లక్నో జట్టు సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించింది. ఈ క్రమంలో లక్నో ఫ్రాంచైజీ అధినేత సంజీవ్ గోయెంకా తమ జట్టు పేరును అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు టీమ్ లోగోను కూడా ఆవిష్కరించారు. అయతే ఈ పేరు గతంలో ఆడిన పూణె జట్టుకు ఉండేది.…
కరోనా కారణంగా ఇండియాలో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ యూఏఈ లో ముగిసింది. కానీ ఐపీఎల్ 2022 పూర్తిగా ఇండియాలోనే జరుగుతుంది అని ఈ మధ్యే బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు ఐపీఎల్ 2022 పై కసరత్తు చేస్తుంది బీసీసీఐ. ఇక తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జరగాల్సిన ఐపీఎల్ 15వ సీజన్ ఏప్రిల్ 2, 2022న ప్రారంభించాలని బీసీసీఐ అనుకుంటున్నట్లు సమాచారం. కానీ…