USA: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన కుటుంబంలో విషాదం నిండింది. దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు శవమై కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తేజ్ ప్రతాప్ సింగ్(43), సోనాల్ పరిహార్(42)తోపాటు వారి 10,6 ఏళ్ల వయసున్న పిల్లలు ప్లెయిన్స్‌బోరో లోని వారి ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు.