హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రోజంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో రానున్న మూడు గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
IMD hopeful of normal monsoon in 2023: ఈ ఏడాది రుతుపవనాల గురించి కీలక విషయం చెప్పింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). 2023లో దేశంలో సాధారణ రుతుపవనాలు ఉంటాయని వెల్లడించింది. దీంతో ఈ ఏడాది భారత్ లో సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఆశిస్తోంది. అయితే భారతదేశంలో రుతుపవన సీజన్ లో ఎల్-నినో ఏర్పడే అవకాశం ఉందని, ఇది వర్షాలను ప్రభావితం చేయవచ్చని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటుంది.
దేశ రాజధానిలో వాతావరణం ఆకస్మికంగా మారింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని పలు ప్రాంతాలు శనివారం తెల్లవారుజామున తేలికపాటి వర్షం పడుతోంది.
మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రవాహం కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. మహారాష్ట్ర విపత్తు పరిస్థితుల నివేదిక ప్రకారం జూన్ 1 నుండి మహారాష్ట్రలో సంభవించిన వర్షం, వరదలకు సంబంధించిన సంఘటనలలో మొత్తం 102 మంది ప్రాణాలు కోల్పోయారు.