దేశ రాజధానిలో వాతావరణం ఆకస్మికంగా మారింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని పలు ప్రాంతాలు శనివారం తెల్లవారుజామున తేలికపాటి వర్షం పడుతోంది. ఢిల్లీలో కూడా ఆకాశం మేఘావృతమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీలోని అక్షరధామ్, పాలం, సఫ్దర్‌జంగ్, లోడి రోడ్, వసంత్ విహార్, ఆర్‌కే పురం, ఇగ్నో, అయానగర్, డేరామండి, యమునానగర్, నర్వానా, బర్వాలా (హర్యానా) సహారన్‌పూర్, దేవ్‌బంద్‌లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు తీవ్రతతో వర్షం కురుస్తుంది.
Also Read:Heavy Rains: మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాల్లో ఉరుములు, వడగళ్ల వానలు
ఘజియాబాద్‌లో కూడా శనివారం తెల్లవారుజామున తేలికపాటి వర్షం కురిసింది. దాదాపు ఒక నెలపాటు ఉష్ణోగ్రతలు అసాధారణంగా ఎక్కువగా ఉన్నందున వర్షంతో ఉపశమనం కలిగించింది. వివిధ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుండి 5 డిగ్రిల వరకు తగ్గుతాయి. రాబోయే నాలుగైదు రోజుల పాటు దేశ రాజధానిలో సాధారణంగా మేఘావృతమై తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
Also Read:Indian Army: భారత సైన్యంలో 7,000 మంది మహిళా సిబ్బంది.. కేంద్రం వెల్లడి
మరోవైపు మార్చి 17 నుండి మార్చి 20 వరకు దేశంలోని చాలా ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి / మోస్తరు వర్షపాతం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది.