Khalistan: ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్‌ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో గతేడాది లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తాన్ అనుకూలవాదులు దాడికి తెగబడ్డారు.
NIA: విదేశాల్లో భారత ఎంబసీలపై దాడికి పాల్పడిన 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుర్తించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఖలిస్తాన్ మద్దతుదారులు అమెరికా, బ్రిటన్, కెనడాల్లోని భారత రాయబార కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. అనుమానితులందరిని ఎన్ఐఏ క్రౌడ్ సోర్సింగ్ విధానాన్ని ఉపయోగించి గుర్తించింది.