భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని.. 47 ఏళ్ల క్రితం భారతీయుల డీఎన్ఏలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని ప్రయత్నించారని.. ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్యంలో నల్లని మచ్చ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంస్కృతి, ఆహారం, దుస్తులు, సంగీతం మరియు సంప్రదాయాల వైవిధ్యం మన ప్రజాస్వామ్యాన్ని చైతన్యవంతం చేస్తుందని ఆయన అన్నారు. జీ-7 దేశాల సమావేశం కోసం జర్మనీ వెళ్లిన ప్రధాని అక్కడ మ్యూనిచ్ నగరంలో ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. సుస్థిర వాతావరణ పద్ధతులు భారతదేశ ప్రజల జీవితాల్లో…