Indian Box Office Report: 2022లో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్లు 10 వేల కోట్ల రూపాయల మార్క్‌ను చేరుకున్నాయి. నవంబర్‌కు సంబంధించిన ఇండియన్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ నెలలో.. హిందీలో వచ్చిన దృశ్యం-2 మూవీ అన్ని భాషల చిత్రాల కన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఈ ఒక్క పిక్చర్ మాత్రమే నవంబర్‌లో వంద కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్‌ను క్రాస్ చేయటం విశేషం.