Book Fair in Hyderabad: పుస్తక ప్రియులకు శుభవార్త. హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. ఈ అవకాశం రేపటి వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇది ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ కాదు. దీని పేరు వేరు. దీన్ని ‘కితాబ్ లవర్స్ బుక్ ఫెయిర్’ అని అంటారు. నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ బుక్ ఫెయిర్ మొన్న గురువారమే ఓపెన్ అయింది. కాబట్టి రేపు ఆదివారం వరకే తెరిచి ఉంచుతారు. అందువల్ల పుస్తకాల పురుగులు త్వరపడటం మంచిది.