Sapta Sindhu 2025 : హైదరాబాద్‌లో AE ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సప్తసింధు-2025 – ఆలయ నమూనాల రూపకల్పన పోటీలు” (Inter College Temple Model Making Competition) ఆర్కిటెక్చర్ విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తెచ్చింది. బుధవారం టీ-హబ్‌లో జరిగిన ఈ పోటీలు విద్యార్థులు రూపొందించిన ఆలయ నమూనాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన పద్మశ్రీ బృహత్ ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ మాట్లాడుతూ, “భారతీయ దేవాలయాల సృజనాత్మకత, శిల్ప సంపద ప్రపంచాన్ని…