విశాఖ గురించి వైఎస్ జగన్ చెప్పిందే.. చంద్రబాబు చెబుతున్నారు.. అన్నివైపులా విశాఖ అభివృద్ధిపై చర్చ సాగుతున్న వేళ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ అప్పుడు విశాఖ గురించి చెప్పిన విషయాలనే ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ మన రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అని తొలి సారిగా వైఎస్ జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. 2014లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు విశాఖ ప్రాధాన్యతను ఎందుకు గుర్తించలేదని…
ప్రపంచకప్ విజేతలు.. మహిళా అంధుల క్రికెట్ జట్టుకు పవన్ కల్యాణ్ సన్మానం.. ప్రపంచ కప్ విజేతలుగా భారత్‌కు గౌరవం తీసుకొచ్చిన మహిళా అంధుల క్రికెట్ జట్టును సన్మానించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందితో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న ఈ మహిళా క్రీడాకారిణులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షల చొప్పున చెక్కులు, కోచ్‌లకు రూ.2…
Toyota Mirai: టయోటా కిర్లోస్కర్ మోటార్ తన సెకండ్ జనరేషన్ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ ‘మిరాయ్’ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (NISE)కి అప్పజేప్పింది. భారతదేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఇదెలా వర్క్ చేస్తుందనే విషయాన్ని పరిశీలించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచంలోని మోస్ట్ అడ్వాన్స్డ్ జీరో ఎమిషన్ వెహికిల్స్ లో టయోటా మిరాయ్ ఒకటి. ఈ కారు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మధ్య జరిగిన రసాయన చర్యతో ఏర్పడిన…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు ప్రవేశపెట్టారు. ఈ కార్డు ద్వారా పౌరసత్వం లభించనుంది. 1 మిలియన్ చెల్లించి గోల్డ్ కార్డు పొంద వచ్చని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయ విద్యార్థులనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Social Media Ban: పిల్లలపై సోషల్ మీడియా చూపుతున్న ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో.. భారతదేశంలో కూడా 16 ఏళ్లలోపు వారికి ఆన్లైన్ మీడియాపై నిషేధం అవసరం ఉందని నటుడు సోనూసూద్ పేర్కొన్నారు.
తాలిబన్లతో ఆచరణాత్మక సంబంధాలను కోరుకుంటున్నట్లు భారత్ తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడారు.
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండా ఇదే..! ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రేపు సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అజెండా అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, ప్రభుత్వ నిర్మాణాలు, పెద్ద ప్రాజెక్టుల అమలు వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రూ.169 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడానికి కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. ఇది రాష్ట్ర…
కడప మాజీ మేయర్ సురేష్ బాబుకి హైకోర్టు షాక్ కడప మాజీ మేయర్ సురేష్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది.. మాజీ మేయర్ సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మేయర్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. రేపు జరగాల్సిన కడప మేయర్ ఎన్నిక కోసం ఈ నెల 4న ఎన్నికల సంఘం నోటిఫికేషన్…
భారతీయులకు హెచ్-1బీ వీసా కష్టాలు వెంటాడుతున్నాయి. హెచ్1-బీ వీసాలపై ట్రంప్ ఆంక్షలు పెట్టాక భారతీయులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక సోషల్ మీడియా నిబంధనలు కొత్త తలనొప్పి తెప్పిస్తున్నాయి. సోషల్ మీడియా నిబంధనలు అమల్లోకి రావడంతో హెచ్-1బీ వీసాల అపాయింట్మెంట్లు వాయిదా పడ్డాయి.