Six Players Will Play ODI World Cup for the First Time: సొంతగడ్డపై జరిగే ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో తలపడే భారత జట్టును మంగళవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ఆశ్చర్యకర నిర్ణయాలేమీ లేకుండానే, అంచనాలకు తగ్గట్లుగానే జట్టును ప్రకటించింది. ఎంఎస్ ధోనీ నాయత్వంలో 2011 అద్భుత ప్రదర్శనను పునరావృతం చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఈసారి…
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ పోస్ట్ను పంచుకున్నారు. అందులో రాజ్యాంగ ప్రవేశిక వ్రాయబడింది. బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో.. టీమిండియా ఆటగాళ్లు.. భారత్ అని రాసి ఉన్న జెర్సీలతోనే క్రికెట్ ఆడాలని ఆయన సూచించారు. ఈ మేరకు బీసిసిఐ కార్యదర్శి అమిత్ షా కొడుకు జై షా కు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విజ్ఞప్తి చేశారు.
రాజ్యాంగంలో ఇండియాతో పాటు భారత్ అని ముందే ఉంది అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. ఇండియా అని బ్రిటీష్ వాళ్ళు ఇచ్చిన పేరు.. దేశం పేరు భారత్ గా మారుస్తున్నారని ప్రచారం జరుగుతుంది.. భారత్ గా మార్చటం తప్పేం కాదు.. ఇందుకు రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. ఈ క్రమంలో ఈ వరల్డ్ కప్ లో పాల్గొనే సౌతాఫ్రికా జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. మొత్తం 15 మందికి ఈ జట్టులో స్థానం కల్పించారు.
జీ-20 విందులో రాష్ట్రపతిని 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' అని రాయకుండా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని రాయడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి 'భారత రాష్ట్రపతి'కి బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అనే పదాన్ని ఉపయోగించడాన్ని స్వాగతించారు. ఇది బానిస మనస్తత్వానికి తీవ్ర దెబ్బ అని అభివర్ణించారు.
రాష్ట్రపతి భవన్లో జరగనున్న జీ-20 సదస్సు విందుకు భారత రాష్ట్రపతి పేరిట పంపిన ఆహ్వానంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం దేశం పేరు మారుస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు. ప్రపంచానికి 'ఇండియా' అనే పేరు తెలుసని.. అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం దేశం పేరు మార్చాల్సే అవసరం ఏమొచ్చిందని అన్నారు.
Xi Jinping: సెప్టెంబర్ 9-10 తేదీల్లో భారతదేశం ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును ఢిల్లీలో నిర్వహిస్తోంది. అయితే ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పుతిన్ ఇండియాకు రావడం లేదు. అతని స్థానంలో ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతున్నారు.