India at UN: తూర్పు జెరూసలేంలో పాటు ఆక్రమిత పాలస్తీనా భూభాగం, ఆక్రమిత సిరయన్ గోలన్ ప్రాంతాల్లో ఇజ్రాయిల్ సెటిల్మెంట్ కార్యకలాపాలను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితితో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతుగా ఇజ్రాయిల్ వైఖరిని ఖండిస్తూ భారత్ ఓటసింది. తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటేయగా అందులో భారత్ కూడా ఉంది. ఈ ముసాయిదా తీర్మానానికి నవంబర్ 9 గురువారం ఆమోదం లభించింది.
CM Pinarayi Vijayan: కేరళలో పాలక సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా సంఘీభావం ర్యాలీలను చేపడుతున్నాయి. శనివారం కోజికోడ్ వేదికగా అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కేరళ సీఎం పినరయి విజయన్ పాల్గొన్నారు.
ప్రపంచకప్ 2023లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్ 15న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ నవంబర్ 16న కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగనుంది. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య భారత్- అమెరికాల 5వ ‘టూ ప్లస్ టూ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడంలో ఇరు దేశాలు ఇజ్రాయెల్‌కు బహిరంగంగా మద్దతు తెలిపాయి.
Virat Kohli React on Big Six Hits on Haris Rauf Bowling: పరిపూర్ణమైన బ్యాటర్ కావడంపై దృష్టి పెట్టడం కంటే.. కొత్త షాట్లు నేర్చుకోవడం మంచిదని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. బ్యాటింగ్‌కు ఇంకా ఏం చేరిస్తే విజయానికి కృషి చేయచ్చో ఆలోచిస్తే ఆట మెరుగవుతుందన్నాడు. ప్రస్తుతం విరాట్ ప్రపంచకప్ 2023లో బాగా ఆడుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడి 543 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఆదివారం…
దీపావళి సందర్భంగా దేశంలోని పలు బ్యాంకులకు లాంగ్ వీకెండ్ హాలీడేలు వచ్చాయి. ఏకంగా 6 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. దంతేరస్ దగ్గర నుంచి (10వ తేదీ నుంచి భాయ్ దూజ్ ముగింపు వరకు) ఈ నెల 15 వరకు అనేక ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.
E-Air Taxis: పెరుగుతున్న కాలుష్యం, వాహనాల రద్దీ మొదలైనవి ప్రజల్ని ఇతర రవాణా వ్యవస్థ వైపు వెళ్లేలా చేస్తున్నాయి. రానున్న కాలంలో ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరగబోతోంది. ఇదిలా ఉంటే 2026 నాటికి ఇండియాలో ఈ-ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిలువగా ఎగిరే ఈ బుల్లి విమానాలు ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పూర్తిగా సంప్రదాయేతర…
Qatar: గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఖతార్ ప్రభుత్వం 8 మంది మాజీ ఇండియన్ నేవీ అధికారులకు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో వీరిని అరెస్ట్ చేసిన అక్కడి అధికారులు, ఇటీవల మరణశిక్ష విధించారు. దీనిపై భారత్ షాక్‌కి గురైంది. దీనిపై న్యాయపరంగా, దౌత్యపరంగా పోరాటానికి భారత్ సిద్ధమైంది.
Sri lanka: ఇండియా మిత్రదేశం శ్రీ లంకలో నానాటికి పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుక భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలోని హంబన్ టోటా నౌకాశ్రయాన్ని లీజుకు తీసుకున్న చైనా అక్కడి నుంచి భారత్‌తో పాటు ఇండో-పసిఫిక్ రీజియన్‌లో నిఘా పెంచుతోంది. ఈ నేపథ్యంలో చైనాను అడ్డుకునేందుకు భారత్, అమెరికాతో జట్టు కట్టింది.
Israel: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి 1400 మందిని దారుణంగా ఊచకోత కోశారు. మరో 200 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ సైన్యం భీకరంగా దాడులు చేస్తోంది. వైమానిక దాడులతో పాటు భూతల దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాను పూర్తిగా దిగ్బంధించింది. మరోవైపు ఇజ్రాయిల్ లో ఉన్న పాలస్తీనియన్లను పంపించేంది.