Maldives: నీటి సర్వేపై భారత్‌తో ఒప్పందాన్ని పునరుద్ధరించుకోం.. మాల్దీవుల ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవుల్లో చైనా అనుకూల వ్యక్తి మహ్మద్ ముయిజ్జు అధ్యక్షుడు కాగానే.. భారత వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్నాడు. ఇప్పటికే ద్వీపదేశంలో ఉన్న భారత సైనికులను వెళ్లాల్సిందిగా కోరాడు. ఇప్పుడు మరో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాడు. భారత్‌తో కలిసి మాల్దీవులు చేస్తున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని ఆ దేశం చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మాల్దీవుల పబ్లిక్ పాలసీ అండర్ సెక్రటరీ మహ్మద్ ఫిరుజుల్ మాట్లాడుతూ.. ‘హఫ్తా-14’ రోడ్ మ్యాప్‌లో భాగంగా దేశ సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేసే ఇతర దేశాలతో ద్వైపాక్షిక, దౌత్య ఒప్పందాలను రద్దు చేస్తున్నామన్నారు.
Read Also: Uttar Pradesh: మైనర్‌పై అత్యాచారం.. బీజేపీ ఎమ్మెల్యేకి 25 ఏళ్ల జైలు శిక్ష
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
గురువారం క్యాబినెట్ సమావేశం అనంతరం మాల్దీవుల అధ్యక్ష కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఫిజురుల్ మాట్లాడారు. భారతదేశం-మాల్దీవుల మధ్య హైడ్రోగ్రఫీ ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని మాల్దీవుల అధ్యక్షుడు మరియు అతని మంత్రివర్గం నిర్ణయించుకున్నారని, ఒప్పందం ప్రకారం జూన్ 2024లో గడువు ఉంది. దీనిని పునరుద్ధరించకూడదని మాల్దీవులు అనుకుంటోంది. జూన్ 8, 2019న ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటన సందర్భంగా హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ ఒప్పందం ప్రకారం.. మాల్దీవుల పరిధిలోని సముద్ర జలాల్లో, రీఫ్స్, లాగూన్స్, కోస్ట్ లైన్స్ వెంబడి ప్రాదేశిక జలాలపై సమగ్ర అధ్యయనం చేయడానికి భారత్‌కి అనుమతి ఉంది.
కొత్తగా బాధ్యతలు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మయిజ్జు ఇప్పటికే మాల్దీవుల్లో భారత సైనికులు ఉనికి ఉండకూడదని అన్నారు. ఇదే సమయంలో తాము ఇతర దేశాల సైనికులకు ఆహ్వానం పలకమని చెప్పారు. తాను అధ్యక్షుడినైతే, మాల్దీవుల సార్వభౌమత్వాన్ని కాపాడుతానని, భారత సైనికులను వెళ్లగొడతాననే హామీ ఇచ్చాడు. దీంతో భారత వ్యతిరేక విధానాలకు తెరతీశారు.
తాజావార్తలు
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!