ఆస్ట్రేలియాతో టీమిండియా 5 టీ20ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా.. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఆ మ్యాచ్ ల్లో టీమిండియానే గెలుపొందింది. కంగారులపై యువ ఆటగాళ్లు చెలరేగడంతో 2-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. చివరి రెండు టీ20 మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
Supreme Court: పాకిస్తాన్కి చెందిన ఆర్టిస్టులను భారతదేశంలో ప్రదర్శనలు ఇవ్వడంపై, వారు ఇక్కడ పనిచేయడంపై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. పిటిషనర్ ‘‘అంత సంకుచిత మనస్తత్వం’’ కలిగి ఉండవద్దని కోరింది. ఈ పిటిషన్ని అత్యున్నత కోర్టు కొట్టేసింది. సినీ వర్కర్, ఆర్టిస్ట్ అని చెప్పుకునే ఫైజ్ అన్వర్ ఖురేషీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిష
Virat Kohli Instagram Story Goes Viral: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి సంబందించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖంపై గాయాలు, ముక్కుపై బ్యాండేజీ ఉన్న ఫొటోను విరాట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. ఫొటోలో కోహ్లీ తెలుపు రంగు టీ షర్ట్ వేసుకోగా.. ఎడమ కన్ను కమిలిపోయి ఉంది. అంతేకాదు కుడి చెంప, ఎడమవైపు నుదురు భాగంలో చిన్న గాయం ఉంది. ఈ ఫొటో నెట్టింట వైరల్…
గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 'స్వయం సమృద్ధి భారతదేశం' అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రపంచానికి లౌకికవాదాన్ని బోధించాల్సిన అవసరం లేదని అన్నారు.
ఆస్ట్రేలియాతో 5 టీ20 సిరీస్ లో భాగంగా.. టీమిండియా రెండో టీ20లో ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో ఆసీస్ పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ లక్ష్యా్న్ని ఆస్ట్రేలియా ముందు పెట్టింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు జైస్వాల్ (53) రుతురాజ్ (58) అర్ధసెంచరీలు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇషాన్ కిషన్ (52) కూడా హాఫ్ సెంచరీ చేశాడు.
టీ20 సిరీస్ లో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఈరోజు రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. తిరువనంతపురంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో కూడా యువ ఆటగాళ్లకే టీమిండియా అవకాశం కల్పిస్తుంది. దీంతో జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది.
Myanmar: భారత సరిహద్దు దేశం మయన్మార్లో ప్రజాప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారాన్ని చేపట్టింది. అప్పటి నుంచి ఆ దేశంలో హింస చెలరేగింది. జుంటా పాలకకు వ్యతిరేకంగా అక్కడ సాయుధ గ్రూపులు పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అక్కడి సైనిక పాలకులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లు సైనికులు కంట్రోల్లో ఉన్న చైనా సరిహద్దు సమీపంలోని ప్రాంతాలను మూడు సాయుధ మైనారిటీ గ్రూపులు స్వాధీనం చేసుకున్నాయి. ఉత్తర షాన్ రాష్ట్రంలోని ఉన్న ఈ చైనా సరిహద్దు…
China Pneumonia: చైనాలో న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. దీనిపై ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనాలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా భారత్ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. ఇటీవల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో భారత్లో వ్యాధి తీవ్రత ఉండదని చెప్పింది. పొరుగు దేశంలో పరిస్థితుల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేస్తూ లేఖ…
Elon Musk: వరల్డ్ బిలియనీర్ ఎలాన్ మస్క్కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్లా, భారత ప్రభుత్వం మధ్య చర్చలు తుది దశకు వచ్చాయి. వచ్చే ఏడాది నుంచి భారత్ లోకి టెస్లా కార్లు దిగమతి కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు టెస్లా సిద్ధమైంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లోని ఏదో చోట ప్లాంట్ నెలకొల్పనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో…