చిన్న పిల్లలకు ఆరేళ్లు నిండితేనే ఒకటవ తరగతిలో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పాకిస్థాన్ దేశానికి భారతదేశం మరో షాక్ ఇచ్చింది. రావి నది జలాలను పూర్తిగా నిలిపి వేసినట్లు సమాచారం. అయితే, దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న షాపుర్ కండీ ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడమే దీనికి ప్రధాన కారణం.
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి భారత్‌పై విషం చిమ్మారు. తన 22 మంది సభ్యుల కేబినెట్లోని ముగ్గురు మంత్రులను విదేశీ దేశం ఆదేశాల కారణంగా మాల్దీవుల పార్లమెంట్ తిరస్కరించిందని ఆయన ఆరోపించారు. నిజానికి మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వ కేబినెట్ ఏర్పాటైన తర్వాత అందులో చేరిన మంత్రులు పార్లమెంటు ఆమోదం పొందడం తప్పనిసరి.
రష్యా ఆర్మీలో సహాయకులుగా రిక్రూట్ అయిన భారతీయులను ఇప్పుడు విడుదల చేస్తున్నారు. దీనిపై రష్యా అధికారులతో భారత్ మాట్లాడిందని, కాంట్రాక్టుపై నియమించుకున్న భారతీయులను విడుదల చేయాలని డిమాండ్ చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ డిమాండ్‌తో చాలా మంది భారతీయులు అక్కడి నుంచి తిరిగొచ్చారు.
పశ్చిమ సరిహద్దులో సీమాంతర ఉగ్రవాదంపై భారతదేశం చాలా కాలంగా ఎదుర్కొంటున్న సవాలుకు ఇప్పుడు మరింత సరైన స్పందన లభిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం అన్నారు.
భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పలు కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయని నీతి అయోగ్ తెలిపింది. అది జరిపిన తాజా సర్వేలో భారత్‌లో దాదాపు 5 శాతం మేర పేదరికం తగ్గిందని నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు.
రాంచీలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆట ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ 24, జైస్వాల్ 16 పరుగులతో ఉన్నారు. కాగా.. ఇంకా భారత్ విజయానికి 152 పరుగులు కావాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 145 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్లర్లు దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
రాంచీలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జరుగుతుంది. అందులో భాగంగా ఇంగ్లండ్‌కు టీమిండియా గట్టి షాక్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 145 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ టార్గెట్ 192 పరుగులు చేయాల్సి ఉంది. కాగా.. భారత్ బౌలర్లు ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను కోలుకోలేని దెబ్బ తీశారు. భారత్ బౌలింగ్ లో అశ్విన్ 5 వికెట్లు తీసి చెలరేగాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 4,…
రాంచీలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. కాగా.. మొదట బ్యాంటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఈరోజు మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా.. ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. అయితే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 134 పరుగులు వెనుకంజలో ఉంది. ఆట ముగిసే సమయానికి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్…
Cross-border marriage: ఇటీవల కాలంలో సరిహద్దు దాటి ప్రేమలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్‌కి చెందిన పలువురు యువతీయువకులు ప్రేమించుకున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. సీమా హైదర్ అనే పాకిస్తానీ యువతి, పబ్జీ ద్వారా పరిచయమైన లవర్ సచిన్ కోసం భారత్ వచ్చిన వార్త సంచలనంగా మారింది. తాజాగా భారత్‌కి చెందిన ఓ యువతి, పాకిస్తాన్ వ్యక్తిని ప్రేమించింది.