ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులకు భారతీయ రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని ఇజ్రాయిల్‌లోని భారతీయ రాయబార కార్యాలయం శుక్రవారం సూచించింది.
Bombay High Court: భారత ప్రభుత్వం ‘‘దేశం వదిలి వెళ్లాలి’’ అని నోటీసులు జారీ చేసినప్పటికీ యెమెన్‌కి చెందిన వ్యక్తి ఇండియాలో ఉండటంపై బాంబే హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
రోహిత్ భారత క్రికెట్ అభిమానులందరికీ ప్రత్యేకమైన, భావోద్వేగ సందేశాన్ని ఇచ్చాడు. బీసీసీఐ (BCCI) షేర్ చేసిన వీడియో కొన్ని వారాల క్రితం అభిమానులు.. ఆటగాళ్లు పంచుకున్న అన్ని చిరస్మరణీయ క్షణాలను సంగ్రహించింది. బార్బడోస్‌లో రోహిత్ కెప్టెన్సీ షూట్ నుండి మెరైన్ డ్రైవ్ దగ్గర విజయ పరేడ్.. వాంఖడే స్టేడియంలో ప్రతిష్టాత్మకమైన సన్మాన కార్యక్రమం వరకు ఈ వీడియోలో చూపిస్తుంది.
ప్రస్తుత సమాజంలో గర్ల్‌ఫ్రెండ్ అనగానే ప్రేయసి అని.. బాయ్‌ఫ్రెండ్ అనగానే ప్రియుడు అనే అర్థం వచ్చేయడం బాధ పరిచే అంశం. ఈ క్రమంలోనే ఈ రోజుల్లో స్నేహితుల్ని ఇతరులకు పరిచయం చేయాలంటే ఇబ్బందికరంగా మారింది. కానీ జాతీయ గర్లఫ్రెండ్స్ దినోత్సవం ఉద్దేశం పూర్తిగా వేరు. ఇందులో ప్రేమకు చోటు లేదు.. కేవలం స్నేహానికి మాత్రం చోటు ఉంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌లో కూడా బెల్జియం భారత్‌ను ఓడించింది. పూల్-బిలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెల్జియం 2-1తో భారత్‌ను ఓడించింది.
బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో భారత స్టార్ షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో 590 స్కోర్ చేసి ఏడో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం స్వప్నిల్ మాట్లాడుతూ.. ధోనీని తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నానని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండాలనే స్ఫూర్తి ధోనీ నుంచి వచ్చిందని చెప్పాడు. ధోనీ తనకు ఆదర్శమని అని అన్నాడు.