ఇదిలా ఉంటే భారతదేశంలో ఇరాన్ రాయబారి డాక్టర్ ఇరాజ్ ఎలాహి మాట్లాడుతూ, ఇజ్రాయిల్ మారణహోమాన్ని ఆపే శక్తి భారత్‌కి ఉందని అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి తాను భారత్ ఒక ముఖ్యమైన దేశమని, బిగ్ పవర్ అని, అంతర్జాతీయ సమాజంలో ప్రభావవంతమైన దేశం అని తాను పదేపదే ప్రస్తావించిన విషయాన్ని ఆయన వెల్లడించారు.
బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు గాడితప్పడంతో ఆ ప్రభావం పొరుగు దేశాలపైన ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు.
బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢిల్లీ చేరుకున్న షేక్ హసీనా.. లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Bangladesh – Indian Trains: బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌కు వెళ్లే అన్ని రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వేస్ అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు.
Bangladeshi PM Reaches India: సోదరి షేక్ రెహానాతో కలిసి షేక్ హసీనా త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో ల్యాండ్ అయినట్లు తెలుస్తుంది. హసీనా రాకను త్రిపుర పోలీసులు నిర్ధారించినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి.
Indian Hockey Player Amit Rohidas Miss semi-finals match against Germany: పారిస్ ఒలింపిక్స్ 2024లో సెమీస్‌కు చేరిన ఆనందంలో ఉన్న భారత హాకీ జట్టుకు ఒలింపిక్ కమిటీ భారీ షాక్ ఇచ్చింది. కీలక ప్లేయర్ అమిత్ రోహిదాస్‌పై కమిటీ ఓ మ్యాచ్ వేటు వేసింది. దాంతో మంగళవారం జర్మనీతో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌కు అతడు దూరం అయ్యాడు. ఆదివారం జరిగిన క్వార్టర్స్‌లో ఉద్దేశపూర్వకంగానే బ్రిటన్ ఆటగాడికి స్టిక్ తగిలించాడని డిఫెండర్ రోహిదాస్‌పై ఓ…