భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. క్రీజులో షాద్ మాన్ ఇస్లాం (7), మోమినుల్ హక్ ఉన్నారు. కాగా.. రెండు వికెట్లను స్పిన్ మాయజాలం అశ్విన్ పడగొట్టాడు. బంగ్లాదేశ్ ప్రస్తుతం 26 పరుగుల వెనుకంజలో ఉంది. కాగా.. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉంది.
India vs Bangladesh Ravindra Jadeja: టీమిండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మధ్య రెండో టెస్టు కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. నాలుగో రోజు మ్యాచ్‌లో రవీంద్ర జడేజా టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. టెస్టు క్రికెట్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 7వ బౌలర్‌గా నిలిచాడు. టెస్టుల్లో భారత్ తరఫున…
Rajnath Singh: పాకిస్తాన్‌ని ఉద్దేశించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, భారత్‌తో స్నేహంగా ఉంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి ఆ దేశం పొందిన దాని కన్నా అతిపెద్ద బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చే వాళ్లం అని ఆదివారం అన్నారు. బందిపొరా జిల్లాలోని గురేజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని కిథోర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడు విలాసవంతమైన కార్ల దొంగతనం ముఠాలో సభ్యుడిగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
టాటా మోటార్స్, ఎమ్‌జి మోటార్‌తో సహా అనేక కంపెనీలు భారతీయ మార్కెట్లో సరసమైన ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్నాయి. టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీ, ఎంజీ మోటార్ యొక్క ఎంజీ కామెట్ ఈవీ వంటి కార్లు రూ. 10 లక్షల బడ్జెట్లో అందుబాటులో ఉన్నాయి.
బిగ్ బాస్ సీజన్ 8 మొదట్లో కొంత ఆనాసక్తిగా అనిపించినా.. రాను రాను ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. కొత్త కాన్సెప్ట్‌లతో జనాలను ఆకట్టుకుంటోంది. ఈ షో ప్రారంభమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయాయి.
బియ్యం ఎగుమతులపై విధించిన చాలా పరిమితులను భారత్ తొలగించింది. 2023లో ఈ ఆంక్షలు విధించారు. రుతుపవనాలు బాగా ఉండడం, ప్రభుత్వ గోదాముల్లో సరిపడా బియ్యం నిల్వ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నాల్గవ త్రైమాసికంలో ఊహించిన దానికంటే మెరుగ్గా 16.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ భారతదేశంలో నియామకాలను వేగవంతం చేయనుంది.