Russia Ukraine War: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో మధ్యవర్తిత్వం చేయగల శక్తి భారత్‌కు ఉందని యూకే మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ తెలిపారు. ప్రస్తుత సంక్షోభ తీవ్రతను ఈ చర్య తగ్గించగలదన్నారు. ఎన్డీటీవీ ప్రపంచ సదస్సు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విలీనం చేసుకోకుండా చూడాల్సి ఉందన్నారు. అదే సమయంలో 2015లో మోడీతో లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో జరిగిన ఓ ఘటనను కూడా యూకే మాజీ ప్రధాని గుర్తుకు తెచ్చుకొన్నారు. మా దేశంలో ప్రధాన మంత్రి లేదా పార్టీ నాయకుడు 4,000 మందితో మాట్లాడితే చాలా గొప్పగా భావిస్తాం.. కానీ, ఓ ప్రత్యేక సందర్భంలో వెంబ్లీ స్టేడియంలో ప్రధాని మోడీ ఏకంగా 85,000 మందిని ఉద్దేశించి మాట్లాడారని గుర్తు చేశారు. ఆ సదస్సులో నేను మాట్లాడుతూ.. యూకేకు తొలి మహిళా ప్రధానిని అందించిన కన్జర్వేటివ్ పార్టీనే.. దేశానికి బ్రిటిష్- ఇండియన్ ప్రధానిని కూడా ఇస్తుందనని చెప్పుకొచ్చాను.. నాడు అక్కడే వెనుక వరుసలో కూర్చొన్న కుర్రాడు రిషి సునాక్ ప్రధాని అవుతారని నాకు కూడా తెలియదని డేవిడ్ కామెరూన్ పేర్కొన్నారు.
Read Also: Bhatti Vikramarka: పవర్ కట్ పై ప్రభుత్వం ఫోకస్.. అత్యవసర సేవలకు ప్రత్యేక వాహనాలు
ఇక, యుద్ధంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ శుక్రవారం రియాక్ట్ అయ్యారు. ఈ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో కచ్చితంగా చెప్పలేమని తెలిపాడు. అదే సమయంలో రష్యా యుద్ధంలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక, 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ నేడు మాస్కోలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బ్రిక్స్ పశ్చిమ దేశాలకు వ్యతిరేకం కాదని.. పశ్చిమ దేశాలు లేని గ్రూపని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను పుతిన్ సమర్థించారు. రష్యా అధ్యక్షతన కజన్ వేదికగా ఈ నెల 22 నుంచి 24 వరకు 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మిట్ కొనసాగనుంది. ఈ సందర్భంగా సభ్య దేశాల అధినేతలతో భారత ప్రధాన మంత్రి ద్వైపాక్షిక చర్చించనున్నారు. ఏడాది వ్యవధిలో మోడీ రష్యాలో పర్యటించడం ఇది సెకండ్ టైం.