అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఆదివారం అల్జీరియా, మౌరిటానియా, మలావిలలో తన అధికారిక పర్యటనకు బయలుదేరారు. భారత దేశాధినేత ఒకేసారి మూడు ఆఫ్రికా దేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి.
భద్రత విషయంలో భారత్ రాజీపడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దసరా సందర్భంగా అన్నారు. ఏ దేశమైనా భారత్ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ వెనకాడబోదని అన్నారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ పూర్తవ్వగా.. టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 297 భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ.. సంజు శాంసన్ టీమ్ ఇండియాకు శుభారంభం అందించాడు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ పూర్తవ్వగా.. టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 297 భారీ స్కోర్ చేసింది.
బంగ్లాదేశ్పై భారత్కు గొప్ప ఆరంభం లభించింది. అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ.. అయితే సంజు శాంసన్ టీమ్ ఇండియాకు శుభారంభం అందించాడు. శాంసన్ సెంచరీ చేశాడు.
India - Bangladesh: బంగ్లాదేశ్లో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. హిందువులు, మైనారిటీలే లక్ష్యంగా రాడికల్ ముస్లింగుంపు దాడులకు తెగబడుతోంది. ఎప్పుడైతే షేక్ హసీనా దిగిపోయి, మహ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి అక్కడ హిందువులకు రక్షణ లేకుండా పోయింది.
బంగ్లాదేశ్లోని జెషోరేశ్వరి ఆలయంలో దుర్గామాత కిరీటం చోరీకి గురైంది. 2021లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు.