రెండు పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, జార్ఖండ్లలో ఎన్నికల నగారా మోగడంతో పార్టీలు మళ్లీ ప్రచారానికి దిగాయి. దళితుల ఓట్లను రాబట్టుకునే పనిలో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి.
భారత్, కెనడాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కెనడాలో సిక్కు నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో అక్కడి భారత రాయబారి ప్రమేయం ఉందని ఆ దేశం ఆరోపించింది. ఇందుకు బలమైన ఆధారాలు సమర్పించాలని భారత్ కోరింది. ఇప్పటికే దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఇచ్చేశామంటోంది కెనడా. అసలు కెనడాకు, ఇండియాకు మధ్య గ్యాప్ ఎందుకొచ్చిందనే విషయం తెలియాలంటే చరిత్రలోకి వెళ్లాలి.. భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. కెనడా దౌత్య సిబ్బందిని భారత్…
బంగ్లాదేశ్కు చెందిన చొరబాటుదారుడు భారత్లోకి చొరబడాలంటే.. దాని ఖరీదు రూ.4 వేలు మాత్రమే. అవును.. రూ.4 వేల కోసం బంగ్లాదేశ్ నుంచి సరిహద్దులు దాటి భారత్లోకి చొరబడుతున్నారు..
సుప్రీంకోర్టులో న్యాయ దేవత కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహంలో కొన్ని మార్పులు చేశారు. విగ్రహం కళ్లకు గంతలు తొలగించి, చేతిలోని కత్తి స్థానంలో రాజ్యాంగ పుస్తకాన్ని ఇచ్చారు.
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా.. మొదటి మ్యాచ్ బెంగళూరులో జరుగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. కాగా.. వర్షం కారణంగా తొలి టెస్టులో మొదటి రోజు ఆట రద్దయింది. టాస్ పడకుండానే ఆట రద్దు అయింది.
S Jaishankar: షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) శిఖరాగ్ర సమావేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరుగుతోంది. బుధవారం ఎస్సీఓ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిన్న ఇస్లామాబాద్ వెళ్లారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి జైశంకర్ చురకలంటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు కార్యకలాపాలు ఉగ్రవాదం, వేర్పాటువాదంతో కూడి ఉంటే, అది ద్వైపాక్షిక వాణిజ్యం, సంబంధాలు సహాయపడేందుకు సహకరించవని అన్నారు.
ఇండియాలో ఎలిస్టా (Elista) గూగుల్ టీవీ(Google TV)ని ప్రారంభించింది. తాజాగా.. 85 అంగుళాల(inches) సైజు టీవీని విడుదల చేసింది. ఇంతకు ముందు.. 32 నుండి 65 అంగుళాలు అందుబాటులో ఉన్నాయి. ఈ 85 ఇంచెస్ టీవీ ధర రూ.1.60 లక్షలు. గూగుల్ టీవీ ఫీచర్ల గురించి చెప్పాలంటే.. లేస్ బెజెల్ డిజైన్ వస్తుంది.
ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు మెటా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే నెలలో భారీగా ఖాతాలపై నిషేధం విధించింది. ఆగస్టు నెలలో 84.58 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించినట్లు వాట్సప్ సంస్థ పేర్కొంది.