క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఆదివారం టీమిండియా, పాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి. గ్రూప్-ఏలో వరుసగా రెండు మ్యాచ్‌లో విజయం సాధించి తొలిస్థానంలో ఉంది టీమిండియా. ఇక పాక్ ఒక మ్యాచ్‌లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. వరుసగా రెండింటిలో ఓడిన హాంకాంగ్ ఆసియాకప్ నుంచి వెళ్లిపోయింది. దీంతో తొలిరెండు స్థానాల్లో ఉన్న టీమిండియా, పాక్ మరోసారి పోటీపడబోతున్నాయి. ఈ హైవోల్టేజ్ సమరానికి టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లో గెలిచి ఫుల్ జోష్‌లో…