భారత్- న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా రెండవ మ్యాచ్ శుక్రవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనున్నది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. నాగ్‌పూర్‌లో విజయంతో సిరీస్‌ను ప్రారంభించిన భారత జట్టు రెండో టీ20లో ఆధిపత్యం చెలాయించడం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో కివీస్‌ను 48 పరుగుల తేడాతో ఓడించినప్పటికీ, భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉంది.…