United Nations Security Council: రష్యా-ఉక్రెయిన్ యుద్దం ప్రారంభం అయిన తర్వాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో భారత్ తొలిసారిగా రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. భద్రతా మండలిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ వర్చువల్ గా ప్రసంగించేందుకు ప్రవేశపెట్టిన తీర్మాణానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. అయితే జెలెన్ స్కీ మాట్లాడేందుకు రష్యా వ్యతిరేకించింది. మొత్తం 15 సభ్య దేశాలు ఉన్న భద్రతా మండలిలో భారత్ తో పాటు మొత్తం 13 దేశాలు జెలెన్ స్కీకి మద్దతుగా నిలవగా..…