India Unemployment Rate: ఈ సంవత్సరం ఇండియాలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ డిసెంబర్ నెలలో అత్యధికంగా నమోదైంది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ వెల్లడించింది. భారతదేశ నిరుద్యోగ రేట్ 2022 డిసెంబర్ 20వ తేదీ నాటికి 9 శాతానికి చేరింది. థర్టీ డే మూవింగ్ యావరేజ్ ప్రాతిపదికన ఇది నవంబర్‌లో 8 శాతంగానే ఉంది. నెల రోజుల్లోనే వన్ పర్సెంట్ పెరిగింది.