పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ముక్తకంఠంతో నినదిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ పై చర్యలు చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సీసీఎస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారత్ దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. పాక్ పై “భారత్ దౌత్యపరమైన దాడి”కి రంగం సిద్ధం చేసింది. భారత్ లోని పాకిస్తాన్ హైకమిషన్‌ను దశల వారీగా మూసివేసే…
Indus Water Treaty: దాయాది దేశం పాకిస్తాన్ భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూనే ఉంది. మంగళవారం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్‌లో సాధారణ టూరిస్టులను టార్గెట్ చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు తామే పాల్పడినట్లుగా పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రమేయాన్ని భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి.
Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్ర ఘటనకు భారత్ పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. పాకిస్తాన్‌తో 1960లో చేసుకున్న ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అటారీ-వాఘా సరిహద్దును మూసేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో జరిగిన సీసీఎస్( భద్రతపై కాబినెట్ కమిటీ) సమావేశంల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.