జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ చర్చ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పర్వతనేని హరీష్ ప్రసంగిస్తూ పాకిస్థాన్‌పై ధ్వజమెత్తారు.