పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఉగ్రవాదులు కేవలం హిందువులనే లక్ష్యంగా చేరుకున్నారు. ఈ దాడిపై తాజాగా ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. కశ్మీర్‌లో జరిగిన హత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మతాల మధ్య యుద్ధం కాదని.. ధర్మం, అధర్మానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు.
Drugs Seized: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారాన్ని పట్టుకున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు. ఇందులో భాగంగా 14.2 కోట్ల విలువ చేసే కోకైన్, 76 లక్షల విలువ చేసే విదేశీ గంజాయి, 1.75 కోట్ల విలువ చేసే 1.78 కేజీల బంగారం సీజ్ చేసారు కస్టమ్స్ అధికారులు. అధికారులు పట్టుకున్న కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచింది లేడి కిలాడి. అదికూడా ఏకంగా 76 క్యాప్సూల్స్ మింగింది కెన్యా జాతీయురాలు.…