Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పాకిస్తాన్ మెడలు వంచుతోంది. ఇన్నాళ్లు మేము ప్రపంచంలోనే తోపు ఆర్మీ అని ఫీల్ అవుతున్న పాకిస్తాన్‌ని, అలా నమ్ముతున్న అక్కడి ప్రజలకు నెమ్మదిగా అసలు విషయాలు తెలిసి వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటోంది.
India Pakistan War: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన కొద్దిసేపటికే, భారత్ సంచలన విషయాన్ని వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్‌కి ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారత్‌పై భారీ దాడికి ప్రయత్నించింది. దీంతో భారత్ సాయుధ దళాలు పాకిస్తాన్ ‘‘గగనతల రక్షణ వ్యవస్థ’’ని నాశనం చేసినట్లు ప్రకటించాయి. పాక్ భారత్‌లోని 15 నగరాలపై డ్రోన్-మిస్సైల్ దాడులు చేసేందుకు ప్రయత్నించిందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. Read Also: India Pakistan Tension:…
India Pakistan Tension: ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల తర్వాత భారత్ మరోసారి పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం కరాచీ, లాహోర్, సియాల్‌కోట్, రావల్పిండి సహా 10 నగరాలపై డ్రోన్ అటాక్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో పాకిస్తాన్ ‘‘గగనతల రక్షణ వ్యవస్థ’’ టార్గెట్ చేసినట్లు సమాచారం. దీంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైంది. పాకిస్తాన్ దాడులు చేస్తుందనే అనుమానం నేపథ్యంలో భారత్ ఈ రక్షణ వ్యవస్థల్ని నాశనం చేసినట్లు తెలుస్తోంది.
Pakistan: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్, భారత్‌తో వాణిజ్యం రద్దు మొత్తంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌ని కుదేలు చేస్తున్నాయి. పాక్ వ్యాప్తంగా ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడుల తర్వాత కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ కుప్పకూలింది. పాకిస్తాన్ బెంచ్‌మార్క్ ఇండెక్స్ KSE-30 ఏకంగా 7200 పాయింట్లు పడిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్‌ని నిలిపేసింది. వరసగా రెండవ సెషన్‌లో భారీ నష్టాలను చవిచూసింది. గురువారం ఉదయం కరాచీ, లాహోర్‌తో సహా పలు ప్రాంతాల్లో పేలుళ్ల…
Indo-Pak tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్ అటాక్ నిర్వహించింది. ఈ దాడిలో 100 మందికి పైగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాడులు మరణించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా ముగియలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. గురువారం అన్ని రాజకీయ పార్టీలతో జరిగి ఆల్ పార్టీ మీటింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ దాడి చేస్తే తీవ్రమైన ప్రతీదాడి ఉంటుందని రక్షణ మంత్రి చెప్పారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు అన్ని రాజకీయ పార్టీల నేతలకు రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అయితే, భద్రతా కారణాల వల్ల సున్నితమైన విషయాలను ప్రభుత్వం పంచుకోలేదని…
All-Party Meet: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ కోడ్‌నేమ్‌తో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. బుధవారం తెల్లవారుజామున భారత్ పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించి పీఓకే, పాక్ భూభాగాల్లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కార్యాలయాలతో పాటు ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లపై విరుకుపడింది.
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులకు ఇజ్రాయెల్ బాసటగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదులను నాశనం చేసేందుకు భారత్ ఇలాగే దాడులు కొనసాగించాలని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఎక్స్ వేదిగా పోస్ట్ చేశారు.
India Pakistan: 26 మంది అమాయకుల్ని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
Sindhu river: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని చనిపోయారు. ఈ ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్‌ని తన నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా, ‘‘సింధు నది జలాల’’ ఒప్పందం నిలిపేసింది. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం దాయాది దేశంలో భయాన్ని పుట్టిస్తోంది. సింధు దాని ఉపనదులు పాకిస్తాన్ 80 శాతం ప్రజలకు జీవనాధారం. ఇప్పుడు, ఇండస్ వాటర్ ట్రిటీని నిలిపేయడంతో పాకిస్తాన్‌ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.