భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ సెంట్రల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు తిరిగి ప్రారంభించాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని చెప్పారు.
భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎన్ని పనులు ఉన్నా అన్నీ ముగించుకుని వచ్చి టీవీల ముందు, ఫోన్ల ముందు అతుక్కుపోవాల్సిందే.. భారత్, పాకిస్తాన్ మధ్య ఏ మ్యాచ్ జరిగినా అభిమానులకు పండగే.. ఎందుకంటే ఈ జట్ల మధ్య మ్యాచ్‌లు తక్కువగా ఉంటాయి. ఈ రెండు జట్ల మధ్య ఎన్నో మరుపురాని మ్యాచ్‌లు జరిగాయి. అందులోనూ ఈ రెండు టీముల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.