దక్షిణ కొరియా కార్ల తయారీదారు కియా జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా ఈవీ6ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్ అధికారికంగా భారత మార్కెట్లో అమ్మకానికి విడుదల చేసింది. కంపెనీ దీనిని GT-Line AWD అనే ఒకే ఒక వేరియంట్‌లో ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 65.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ తన కొత్త సూపర్‌కార్ వాన్‌క్విష్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన V12 ఇంజిన్‌తో కూడిన ఈ సూపర్ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 8.85 కోట్లు (ఎక్స్-షోరూమ్). ప్రపంచవ్యాప్తంగా 1,000 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ యూనిట్లలో కొన్ని భారతదేశంలో కూడా అమ్మకానికి ఉంచనుంది. అయితే, భారతదేశంలో ఎన్ని యూనిట్లను అమ్మకానికి ఉంచారనే దానిపై కంపెనీ సమాచారం ఇవ్వలేదు.